Shopify ఆటోమేషన్‌లు

కస్టమర్‌లకు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవ్వండి

ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే మార్కెటింగ్ ఆటోమేషన్‌లను సృష్టించి, అనుకూలీకరించండి. దీని ద్వారా కస్టమర్‌ల ప్రయాణంలోని ప్రతి దశలోనూ వాళ్లతో ఎంగేజ్ అవుతూ మీ వ్యాపార వృద్ధిని వేగవంతం చేయండి.

మీకు Shopify స్టోర్ లేదా? ఉచిత ట్రయల్‌ను ప్రారంభించండి.

'Welcome new subscribers' అనే వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌లో ఎడమవైపున ఒక ట్రిగ్గర్ ఉంటుంది. కస్టమర్ ఇమెయిల్ మార్కెటింగ్‌కు సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు, అది కింది యాక్షన్‌కు బాణం గుర్తుతో కనెక్ట్ అవుతుంది, దాని ద్వారా మార్కెటింగ్ ఇమెయిల్ పంపబడుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో Soap Club కంపెనీకి చెందిన ఒక నమూనా ఇమెయిల్ ఉంటుంది.

అత్యుత్తమంగా పనిచేసే ఆటోమేషన్‌లను సృష్టించండి

ఈ చిత్రం Shopifyలో మార్కెటింగ్ ఆటోమేషన్‌ను, అలాగే మీ అడ్మిన్ డాష్‌బోర్డ్ నుండి ఫలితాలను ఎలా ట్రాక్ చేయవచ్చనే దాన్ని చూపుతుంది.

కస్టమ్ ఆటోమేషన్‌లు

మీ వ్యాపార ఖచ్చితమైన అవసరాలకు సరిపోయేలా సులభమైన ట్రిగ్గర్-కండిషన్-యాక్షన్ ఇంటర్‌ఫేస్‌తో కస్టమ్ ఆటోమేషన్‌లను రూపొందించండి.

కస్టమర్ ప్రయాణం కోసం టెంప్లేట్‌లు

స్వాగతం, విన్‌బ్యాక్ ఆటోమేషన్‌ల నుండి మొదటి కొనుగోలు అప్‌సెల్ వరకు, వాణిజ్యం కోసం రూపొందించిన, వినియోగానికి సిద్ధంగా ఉండే టెంప్లేట్‌లను పొందండి.

వేగవంతమైనది మరియు నమ్మదగినది

Shopify ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్‌తో, మీ సందేశాలు ఎటువంటి జాప్యం లేకుండా మీ కస్టమర్‌లకు చేరుకుంటాయి—ఒకవేళ మీరు కావాలని ఆలస్యం చేస్తే తప్ప.

సరైన సమయంలో కనెక్ట్ అవ్వండి

కస్టమర్‌ల ప్రయాణంలో ముఖ్యమైన దశల్లో వారితో కనెక్ట్ కావడానికి ఆటోమేషన్‌లను ప్రారంభించి, రన్ చేయండి—మీ న్యూస్‌లెటర్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం నుండి వారి మొదటి ఆర్డర్‌ ఇవ్వడం వరకు, అలాగే మధ్యలో వచ్చే ప్రతి మైలురాయి వద్ద కనెక్ట్ అవ్వండి.
కస్టమర్‌లు కొనుగోలు చేసిన తర్వాత కృతజ్ఞతలు చెప్పే ఒక వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌లో ఆర్డర్ క్రియేట్ అయినప్పుడు ప్రారంభించడానికి ఒక ట్రిగ్గర్, 1 రోజు వేచి ఉండటానికి ఒక షరతు, ఆర్డర్‌ల సంఖ్య 1కి సమానంగా ఉందో లేదో చెక్ చేయడానికి మరో షరతు, అలాగే మార్కెటింగ్ ఇమెయిల్ పంపడానికి ఒక యాక్షన్ ఉంటుంది.

షరతులను ఎంచుకోండి

సరైన సమయంలో సరైన కస్టమర్‌కు మీ సందేశం చేరే అవకాశాలను పెంచే షరతుల ఆధారంగా, ఆటోమేషన్‌లు ఏ విధంగా రన్ కావాలో నిర్ణయించుకోండి. ఆర్డర్ ప్లేస్ చేయకముందు, డెలివరీ జరిగినప్పుడు లేదా ప్రత్యేక సందర్భంలో సందేశాన్ని పంపండి.

సమయం, విరామ వ్యవధిని సెట్ చేయండి

ఒక కొనుగోలు లాంటి గత యాక్షన్‌ ఆధారంగా కూడా సందేశాలు కస్టమర్‌లకు ఎప్పుడు చేరాలో నిర్ణయించండి. మెసేజ్‌ల మధ్య తగినంత విరామం ఇవ్వడానికి, అలాగే ఇమెయిల్ పంపే సరైన క్రమాన్ని సృష్టించడానికి మీ వర్క్‌ఫ్లోలలో వెయిట్ స్టెప్స్‌ను చేర్చండి.

వాటంతట అవే రన్ అయ్యే ఇమెయిల్‌లను సృష్టించండి

నిమిషాల్లో ప్రారంభించండి

ఇమెయిల్ ఆటోమేషన్ టెంప్లేట్‌ల నుండి ఎంచుకుని, కంటెంట్‌ను అనుకూలీకరించి పంపడం ప్రారంభించండి. ఇమెయిల్‌లలో ఇప్పటికే మీ లోగో, బ్రాండింగ్ చేర్చబడి ఉంటాయి.

ట్రాక్ చేయండి, పరీక్షించండి మరియు వృద్ధి చెందండి

ఇమెయిల్ ఎంగేజ్‌మెంట్, సేల్స్ మరియు మరిన్నింటికి సంబంధించి అమలు చేయదగిన రిపోర్ట్‌లతో ఇమెయిల్ ఆటోమేషన్‌ల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోండి.

తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయండి

మీ ఆటోమేషన్‌లను ఆన్ చేసి, వాటిని రన్ అవ్వనివ్వండి. పదే పదే మ్యాన్యువల్‌గా ఇమెయిల్ క్యాంపెయిన్‌లను చేయాల్సిన అవసరం లేదు.
చేరుకున్న కస్టమర్‌లు, కన్వర్షన్ రేట్, రికవర్ చేసిన సేల్స్ జాబితాను చూపే 'కస్టమర్ విన్‌బ్యాక్ టెంప్లేట్' పనితీరు డాష్‌బోర్డ్. పర్పుల్ గ్రేడియంట్‌తో ఉన్న ఒక పెద్ద వృత్తం, రెండు చిన్న వృత్తాలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటాయి. అలాగే ముగ్గురు వ్యక్తులు (నల్లజాతీయుడైన పురుషుడు, శ్వేతజాతీయురాలైన మహిళ మరియు ఆసియా పురుషుడు) ఉన్న మూడు చిన్న వృత్తాలు కుడివైపు ముందు భాగంలో ఉంటాయి.

ఆటోమేషన్‌ను ఉపయోగించడం ప్రారంభించడానికి రిసోర్స్‌లు

ఆన్‌లైన్ కోర్సు

ముఖ్యమైన సందేశాలను పంపడానికి మార్కెటింగ్ ఆటోమేషన్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

కోర్సును ప్రారంభించండి 

సహాయ కేంద్రం

ఆటోమేషన్‌లను రూపొందించడం కోసం తక్షణ సమాధానాలు, అలాగే దశలవారీ మార్గదర్శకాలను కనుగొనండి.

సహాయ కేంద్రాన్ని సందర్శించండి 

మీ వ్యాపార వృద్ధికి సహాయపడే ఆటోమేషన్‌లను సృష్టించడం ప్రారంభించండి